మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా ఇప్పుడు చేస్తున్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో ఎప్పుడు నుంచో చూస్తున్న ఈ సినిమా నుంచి నేడు మహేష్ బాబు బర్త్ డే కానుకగా ఒక ఊహించని సర్ప్రైజ్ రాజమౌళి బ్లాస్టింగ్ సర్ప్రైజ్ అందించారు.
మొదట చాలామంది ఎలాంటి అప్డేట్ ఉండదు అనే అనుకున్నారు కానీ రాజమౌళి ఒక సాలిడ్ పోస్టర్ ని మహేష్ బాబుపై ప్రీ లుక్ పోస్టర్ ని వడలడంతో ఒక్కసారిగా మహేష్ ఫ్యాన్స్ కి మతిపోగొట్టేసినట్టు అయ్యిపోయింది. ఇక ఇందులో మహేష్ ధరించిన లాక్కెట్ బాగా చూస్తే గుండెలపై రక్తం కనిపిస్తున్నాయి. ఇక ఫైనల్ గా నవంబర్ లో ఫస్ట్ రివీల్ ఉంటుంది కన్ఫర్మ్ చేశారు. మొత్తానికి మాత్రం మహేష్ 50వ పుట్టినరోజు అభిమానులకి నిండిపోయింది అని చెప్పాల్సిందే.