ఎన్నడూ కనిపించనత స్టైలిష్ గా కనిపించనున్న మహేష్ బాబు

Mahesh-Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు యూత్ కి ఒక స్టైల్ ఐకాన్. ఇండియాలోనే మోస్ట్ హన్డ్సం నటుల్లో ఒకరని అందరూ ఒప్పుకున్నారు. నమ్రత మహేష్ జీవితంలోకి వచ్చినప్పటి నుండి అతను ఇంకా మోడ్రన్ గా కన్పించడమే కాకుండా ఎంతో హ్యాపీ గా ఉన్నాడు. ప్రస్తుతం మేము విన్న సమాచారం ప్రకారం ఈ హాన్డ్సం హీరో సుకుమార్ సినిమాలో ఇంకా అందంగా కనిపించనున్నాడు. సుకుమార్ మహేష్ బాబు లుక్ విషయంలో సరికొత్తగా ఫీల్ అవ్వాలని ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

ఈ జూన్ నుంచి ఈ సినిమాని లండన్ లో షూట్ చెయ్యనున్నారు. ఈ సినిమాతో కృతి సనన్ హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం కానుంది. ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న దేవీ శ్రీ ప్రసాద్ సరికొత్త సౌండ్ ట్రాక్స్ ఇవ్వాలని సౌండ్స్ పై ప్రయోగాలు చేస్తున్నాడు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు ఈ సినిమాని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2013 సెకండాఫ్ లో విడుదల చేస్తారని అంచనా వేస్తున్నారు.

Exit mobile version