రాజకీయాలకు దూరంగా ఉంటానన్న ప్రిన్స్

Mahesh
టాలీవుడ్ అందగాడు, ప్రస్తుత నెంబర్ 1 రేస్ లో నెంబర్ 1గా వినిపించే పేరు మన మహేష్ బాబు. అతను ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘1’ అనే సినిమాలో నటిస్తున్నాడు. నేనొక్కడినే అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. నిన్న విజయవాడలో రెయిన్బో హాస్పటల్స్ ప్రారంభానికి వెళ్ళిన మన సూపర్ స్టార్ అక్కడ మీడియాతో ముచ్చటించారు. అందులో భాగంగా తనకు రాజకీయాలు పడవని, ఏ పార్టీని సపోర్ట్ చెయ్యనని, మరీ మాట్లాడితే ఆ ఆరు నెలలు ఎక్కడికైనా వెళ్ళిపోతానని తెలిపాడు. అంతే కాదు తాను రాజకీయాల నేపధ్యంలో నటించిన ‘సైనికుడు’ సినిమా వారంరోజులు మాత్రమే ఆడిందని చురక వేసాడు. పాపం ప్రిన్స్ కు రాజకీయాలు ఇష్టంలేదంటే వినరే??

Exit mobile version