మహేష్ బాబుకు విపరీతంగా నచ్చిన పుస్తకం.. ఇంతకీ ఏముంది అందులో ?


సూపర్ స్టార్ మహేష్ బాబుకు పుస్తక పఠనం అలవాటుంది. షూటింగ్స్ లెనప్పుడు, ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవడం ఆయన వ్యాపకం. ఈ లాక్ డౌన్ సమయంలో చిత్రీకరణలు ఏవీ లేకపోవడంతో మహేష్ తన పూర్తి సమయాన్ని కుటుంబానికి, పుస్తకాలకు కేటాయించారు. అలా ఈ లాక్ డౌన్ టైంలో తాను చదివిన ఒక మంచి పుస్తకం గురించి ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు మహేష్. ఆ పుస్తకం తనను ఎందుకంత విపరీతంగా ఆకట్టుకుందో చెప్పుకొచ్చారు.

మహేష్ మెచ్చిన ఆ పుస్తకం పేరు ‘థింక్ లైక్ ఏ మాంక్’. ఈ పుస్తకాన్ని రచించింది జే శెట్టి అనే పాపులర్ రచయిత. పుస్తకానికి ఉన్న పేరు లాగే జే శెట్టి కూడ ఒకప్పుడు సన్యాసి. మూడేళ్ల పాటు సన్యాసిగా జీవితం గడిపారు. ఈయన తన పుస్తకంలో మనసుకు ప్రశాంతంగా ఉండటం, ఒక కారణంతో ఉండటం ప్రతిరోజూ ఎలా నేర్పాలి అనేది వివరించారు. సన్యాసిగా తన అనుభవాల నుండి ఈ పుస్తకాన్ని రాశారాయన.

ఇది మహేష్ బాబుకు విపరీతంగా నచ్చింది. ‘పుస్తకం చదువుతున్నంత సేపు రచయిత మనతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఇలాంటి అనుభూతి అరుదుగా దొరుకుతుంది. అలాంటి వాటిలో ఇది ఒకటి. సరళమైన, ఆచరణీయమైన విషయాలు. ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకం’ అంటూ తన అభిప్రాయాన్ని తెలిపారు. మహేష్ ఫీడ్ బ్యాక్ ఇంత గొప్పగా ఉందంటే పుస్తకం తప్పకుండా గొప్పదే అయ్యుంటుంది. ఇక ఆలస్యం ఎందుకు.. మీరు కూడ పుస్తక ప్రియులే అయితే వెంటనే ‘థింక్ లైక్ ఏ మాంక్’ పుస్తకాన్ని కొని చదివేయండి మరి.

Exit mobile version