ఐదవ సినిమాలోనే మహేష్ ఆ క్రేజీ రోల్ చేశారు.

ఐదవ సినిమాలోనే మహేష్ ఆ క్రేజీ రోల్ చేశారు.

Published on Jul 23, 2020 4:36 PM IST

టాలీవుడ్ లో ప్రయోగాల హీరోగా సూపర్ స్టార్ కృష్ణకు మంచి పేరుంది. టాలీవుడ్ కి కొత్త సాంకేతికను పరిచయం చేసిన హీరోగా ఆయన రికార్డులకు ఎక్కారు. కౌ బాయ్ మూవీ చేసిన మొదటి ఇండియన్ హీరో కృష్ణ కావడం అరుదైన అంశం. 1971 లో వచ్చిన మోసగాళ్లకు మోసగాడు కౌ బాయ్ నేపథ్యంలో వచ్చిన ఫస్ట్ ఇండియన్ మూవీ. ఆ మూవీ ఘన విజయం అందుకోగా ఆ స్పూర్తితో టాలీవుడ్ మరియు బాలీవుడ్ తో పాటు అనేక పరిశ్రమలలో కౌ బాయ్ చిత్రాలు రావడం జరిగింది.

కాగా తండ్రి అడుగుజాడల్లో నడిచే మహేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తరువాత 5వ చిత్రమే కౌ బాయ్ నేపథ్యంలో చేశారు. 2002 లో వచ్చిన టక్కరి దొంగ చిత్రం మహేష్ నటించిన కౌ బాయ్ మూవీ. దర్శకుడు జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో బిపాసాబసు, లిసా రే హీరోయిన్స్ గా నటించారు. కౌ బాయ్ గా మహేష్ అధ్బుత సాహసాలు ప్రేక్షకులకు బాగా నచ్చాయి. మణిశర్మ మ్యూజిక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఐతే ఈ మూవీ ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది.

తాజా వార్తలు