రాక్ స్టార్ కి సూపర్ స్టార్ బెస్ట్ విశెష్..!

రాక్ స్టార్ దేవిశ్రీ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. దీనితో ఆయనకు ప్రముఖల నుండి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక టాలీవుడ్ స్టార్స్ అయిన మహేష్ మరియు అల్లు అర్జున్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ”హ్యాపీ బర్త్ డే రాక్‌స్టార్. నీ అద్భుతమైన సంగీతంలో మ్యూజిక్ చార్ట్ బస్టర్స్‌ను పాలించు. గ్రేట్ డే, స్టే సేఫ్”అని మహేశ్ ట్వీట్ చేశారు. నా ప్రియమైన స్నేహితుడికి జన్మదిన శుభాకాంక్షలు. నా కెరీర్‌లో అత్యధిక చిత్రాలకు నువ్వే సంగీతం అందించావు. ఈ ఏడాది నీకు గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను” అని బన్నీ ట్వీట్ చేశారు.

1999లో వచ్చిన దేవి చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన దేవిశ్రీ, ఆనందం, ఖడ్గం, మన్మథుడు వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 21 ఏళ్ల సుధీర్ఘ సినీ ప్రయాణంలో దేవిశ్రీ అందరూ టాప్ స్టార్స్ తో పనిచేశాడు. ప్రస్తుతం దేవిశ్రీ అల్లు అర్జున్ సుకుమార్ ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప మూవీకి స్వరాలు కట్టే పనిలో ఉన్నాడు.

Exit mobile version