మహేష్ సితారతో, బన్నీ అర్హతో..మామూలు అల్లరి కాదు.

మహేష్ సితారతో, బన్నీ అర్హతో..మామూలు అల్లరి కాదు.

Published on Apr 27, 2020 8:21 PM IST

లాక్ డౌన్ కారణంగా సినిమాను బాగా మిస్ అవుతున్నారు హీరోలు. వారి కొత్త సినిమా షూటింగ్స్ మరియు రిలీజ్ లు, స్టోరీ సిట్టింగ్ లు అన్నీ ఆగిపోయాయి. లాక్ డౌన్ తో ఇంటికే పరిమితం అవుతున్నారు. ఇది చాల బాధించే విషయం అయినప్పటికీ దీని వలన వారికి ఓ ప్రయోజనం చేకూరింది. షూటింగ్స్ , మీటింగ్స్ తో క్షణం తీరక లేకుండా గడిపే స్టార్ హీరోలు తమ కుటుంబాలతో గడిపే అవకాశం ఈ కరోనా లాక్ డౌన్ కల్పించింది.

కాగా మహేష్ బన్నీ తమ పిల్లలతో గడుపుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా వీరు అమితంగా ప్రేమించే తమ కూతుళ్లతో దిగిన ఫోటోలు, చేసే అల్లర్లు ముచ్చటేస్తున్నాయి. మహేష్ తన కూతరు సితారతో సరదా ఆటలు ఆడుతుంటే, బన్నీ అల్లు అర్హతో సరదాగా ఆడుకుంటున్నారు. మహేష్ ఫ్యామిలీ తో సితార చిచ్చర పిడుగైతే, అల్లు అర్జున్ ఫ్యామిలీలో అర్హ ఆటం బాంబ్. తండ్రులతో వీరి అల్లరి మాములుగా ఉండదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు