ఇక మహేష్ కూడా రంగంలో దిగనున్నారా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ వరుసగా మూడు భారీ హిట్లతో హ్యాట్రిక్ జైత్ర యాత్రను కొనసాగించారు. అలా మరో హ్యాట్రిక్ విజయాలకు శ్రీకారం చుడుతూ స్టార్ట్ చేసిన లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురామ్ తో ప్లాన్ చేసిన ఈ భారీ ప్రాజెక్ట్ కేవలం ప్రీ లుక్ తోనే తారా స్థాయి అంచనాలను నెలకొల్పుకుంది.

కానీ ఇప్పటి వరకు అసలైన షూటింగ్ పార్ట్ మాత్రం మొదలు కాలేదు. దీనితో షూట్ ఎప్పుడు మొదలు అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. అయితే మరోపక్క ఇప్పుడిప్పుడే మిగతా భారీ ప్రాజెక్టులు షూటింగులు తిరిగి ప్రారంభించడానికి రెడీ అవుతున్నాయి.

అదే బాటలో మహేష్ కూడా రంగంలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయని టాక్. అయితే ఈ చిత్రం షూటింగ్ విషయంలో రెండు వెర్షన్ లు వినిపిస్తున్నాయి. ఒకటి మన దగ్గర షూట్ తో మొదలు కావాలా అన్నది మరొకటి యూ ఎస్ లో షూట్ చేయనున్నారని తెలుస్తుంది. మరి ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు మొదలు కానుందో చూడాలి.

Exit mobile version