రాజమౌళి కోసం మహేష్ ఆ డైరెక్టర్ కి హ్యాండిచ్చాడా..!

రాజమౌళి కోసం మహేష్ ఆ డైరెక్టర్ కి హ్యాండిచ్చాడా..!

Published on Apr 25, 2020 8:00 AM IST

మహేష్ దర్శకుడు వంశీ పైడిపల్లికి హ్యాండ్ ఇచ్చినట్లేనా..? ఆయనతో మహేష్ మూవీ ఇప్పట్లో ఉండదా..? తాజా పరిణామాలు చూస్తుంటే అదే అనిపిస్తుంది. గత ఏడాది వంశీ పైడిపల్లి మహేష్ తో మహర్షి తీశాడు. అది సూపర్ హిట్ కావడంతో వంశీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి కూడా మహేష్ ఒకే చెప్పారు. ఇక సరిలేరు నీకెవ్వరు తరువాత ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లాల్సి వుంది. స్క్రిప్ట్ నచ్చలేదని మహేష్ ఈ ప్రాజెక్ట్స్ హోల్డ్ లో పట్టారు. కాగా మహేష్ తన ప్రాజెక్ట్ డైరెక్టర్ పరుశురాం తో కమిట్ అయినట్లు తెలుస్తుంది. దీనితో మహేష్ వంశీ పైడిపల్లి మూవీ ఇప్పట్లో లేనట్టే అని ప్రచారం జరుగుతుంది. దానికి కారణం.

ఐతే ఇటీవల రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ తర్వాత తన ప్రాజెక్ట్ మహేష్ తో అని ప్రకటించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ 2021 చివర్లో లేదా 2022 ప్రారంభంలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం కలదు. మరి ఈ గ్యాప్ లో మహేష్ ఒక్క సినిమా కంటే ఎక్కువ చేయలేడు. పరుశురాంతో మూవీ అంటున్నారు కాబట్టి అది 2021లో విడుదల అవుతుంది. నెక్స్ట్ రాజమౌళి సినిమాలో జాయిన్ కావలసిన మహేష్ మరో సినిమాను ఒప్పుకొనే అవకాశం లేదు. కాబట్టి నిజంగా మహేష్ పై ఆశలతో స్క్రిప్ట్ కి మెరుగులు దిద్దుతున్నట్లైతే వంశీ పప్పులో కాలేసినట్టే. మహేష్ వంశీతో రాజమౌళి సినిమాకు ముందు సినిమా చేయని పక్షంలో వీరి ప్రాజెక్ట్ ఎప్పుడో చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా రాజమౌళి ప్రకటన వంశీ పైడిపల్లి ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు