ప్రముఖ నిర్మాణ సంస్థ హొంబాలే ఫిలింస్ బ్యానర్ నుంచి వచ్చిన లేటెస్ట్ యానిమేషన్ చిత్రం ‘మహావతార్ నరసింహా’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఓ యానిమేషన్ సినిమా బడా చిత్రాలను ఓవర్‌టైక్ చేసి కలెక్షన్స్‌తో విధ్వంసం క్రియేట్ చేస్తోంది. ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు కలెక్ట్ చేసి ‘మహావతార్ నరసింహ‘ రికార్డులు క్రియేట్ చేస్తోంది.
ఈ సందర్భంగా మేకర్స్ ఈ చిత్ర సక్సెస్‌పై స్పందించారు. ఇలాంటి యునానిమస్ రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉందని దర్శకుడు అశ్విన్ కుమార్ అన్నారు. అయితే, ఈ సినిమా తర్వాత తాము ‘మహావతార్ పరశురాముడు’ చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని.. ఈ సినిమాతో థియేటర్ల టాప్ లేవాల్సిందే అని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
‘మహావతార్ నరసింహ’ కంటే ఎక్కువ ఉగ్రరూపాన్ని పరశురాముడి సినిమాలో ఉంటుందని.. ఈ విధ్వంసంతో ప్రేక్షకులు ఊగిపోవడం ఖాయమని ఆయన అంటున్నారు. ఈ సినిమాను మరింత ఎక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.