హిందీలో ‘మహావతార్ నరసింహ’కి బ్రహ్మరథం.. మరో వీక్ డేలో సాలిడ్ వసూళ్లు!

mahavatara-narasimha

శ్రీవిష్ణు దశావతారాల్లో ఒకటైన పవర్ఫుల్ అవతారం నరసింహ అవతారంపై దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించిన భారీ యానిమేషన్ చిత్రమే ‘మహావతార్ నరసింహ’. చిన్న చినుకుగా మొదలైన ఈ సినిమా ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర ఆల్రెడీ ఆల్ టైం హైయెస్ట్ వసూళ్లు అందుకున్న యానిమేషన్ సినిమాగా రికార్డు సెట్ చేసింది.

ఇక హిందీ మార్కెట్ లో అయితే ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారని చెప్పాలి. సినిమా రిలీజ్ అయ్యాక రెండో సోమవారం వచ్చేసరికే చాలా సినిమాలు రన్ పూర్తయ్యిపోతుంది. అలాంటిది మహావతార్ నరసింహ ఒక్క హిందీ వెర్షన్ లోనే 5 కోట్లకి దగ్గరగా నెట్ వసూళ్లు అందుకున్నట్టు పి ఆర్ లెక్కలు చెబుతున్నాయి.

ఇక నేడు మంగళవారం కూడా ప్రతీ గంటకి 10 వేలకి పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఈ లెక్కన ఈ డివోషనల్ చిత్రం ప్రేక్షకులని ఏ రకంగా ఆకట్టుకుందో అర్ధం చేసుకోవచ్చు. ఆల్రెడీ 100 కోట్లకి పైగా వసూళ్లు అందుకున్న ఈ సినిమా నెక్స్ట్ 200 కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలు కూడా గట్టిగా ఉన్నాయి.

Exit mobile version