కమల్ హాసన్ “విశ్వరూపం” తాజాగా మరో కొత్త అడ్డంకిని ఎదుర్కుంటుంది. ఈ చిత్రాన్ని తమిళనాడు ప్రభుత్వం బ్యాన్ చేసిన విషయం నిన్న తెలిపాము. ఈ చిత్రాన్ని 15 రోజుల పాటు బ్యాన్ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఆశ్చర్యపోయిన కమల్ హాసన్ హైకోర్ట్ ని ఆశ్రయించారు. సమాచార వర్గాల సమాచారం ప్రకారం న్యాయమూర్తి ఈ చిత్రం చూసేవరకు వేచి ఉండవలసిందిగా ముస్లిం వర్గాల తరుపు న్యాయవాదిని కోరారు. కమల్ హసన్ న్యాయవాది ఈ చిత్రం మూడు భాషల్లో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది సమస్య ఎక్కడ వచ్చింది అని వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్నాక తీర్పుని జనవరి 28కి వాయిదా వేశారు. “విశ్వరూపం” చిత్రం ప్రారంభ వసూళ్లు భారీ ఎత్తున రావలసి ఉంది. పొడవయిన వారంతం కావడంతో ఓపెనింగ్స్ భారీగా వస్తుంది అని ఊహించారు. కాని ఈ చిత్రం ప్రస్తుతం వాయిదా పడటంతో ఈ ఊహలు అడియాశలు అయ్యాయి ఇటు కమల్ హాసన్ మరియు సినిమా ప్రేమికులు ఎవరు ఈరోజు జరిగినదానికి సంతోషించడం లేదు. అనుకున్న విధంగా తెలుగు వెర్షన్ చిత్రం రానుంది. కమల్ హాసన్ రచించి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో ఆయనే ప్రధాన పాత్ర పోషించారు. పూజ కుమార్, ఆండ్రియా మరియు రాహుల్ బోస్ ఈ చిత్రంలో ప్రధాన పత్రాలు పోషించారు. ఈ చిత్రం గ్లోబల్ టెర్రరిజం మీద ఉండబోతుంది.
విశ్వరూపం విడుదల మీద మద్రాస్ హైకోర్ట్ స్టే
విశ్వరూపం విడుదల మీద మద్రాస్ హైకోర్ట్ స్టే
Published on Jan 24, 2013 4:40 PM IST
సంబంధిత సమాచారం
- వరల్డ్ వైడ్ డే 1 భారీ ఓపెనింగ్స్ అందుకున్న ‘మిరాయ్’
- ‘మిరాయ్’ కి కనిపించని హీరో అతనే అంటున్న నిర్మాత, హీరో
- ‘మహావతార్ నరసింహ’ నుంచి ఈ డిలీటెడ్ సీన్ చూసారా?
- నార్త్ లో ‘మిరాయ్’ కి సాలిడ్ ఓపెనింగ్స్!
- తెలుగు స్టేట్స్ లో ‘ఓజి’ బుకింగ్స్ ఆరోజు నుంచే ఓపెన్!?
- యూఎస్ మార్కెట్ లో ‘మిరాయ్’ సెన్సేషనల్ ఓపెనింగ్స్!
- పోల్ : తేజ సజ్జ ‘మిరాయ్’ వర్సెస్ ‘హను మాన్’ లలో ఏది మీకు బాగా నచ్చింది?
- ‘ఓజి’కి ఏపీలో ముందే షో పడనుందా?
- ‘మహావతార్ నరసింహ’ విధ్వంసం.. 50 రోజులు రికార్డు థియేటర్స్ లో
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- సమీక్ష : డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ – విజువల్ ట్రీట్‌తో పాటు ఎమోషనల్ బీట్
- పోల్ : మిరాయ్ చిత్రం పై మీ అభిప్రాయం..?
- ‘మహావతార్ నరసింహ’ విధ్వంసం.. 50 రోజులు రికార్డు థియేటర్స్ లో
- పోల్ : తేజ సజ్జ ‘మిరాయ్’ వర్సెస్ ‘హను మాన్’ లలో ఏది మీకు బాగా నచ్చింది?
- సూర్యకు సంక్రాంతి కష్టాలు.. ఇక ఎండాకాలమే దిక్కా..?
- నార్త్ లో ‘మిరాయ్’ కి సాలిడ్ ఓపెనింగ్స్!