ప్రముఖ బాలీవుడ్ నటి మధురి దీక్షిత్ కి ఈ రోజు చాలా బాధకరమైన రోజు. ఆమె తండ్రి శ్రీ శంకర్ ఆర్. దీక్షిత్ ఈ రోజు ఉదయం ముంబైలో మరణించారు. అయన వయస్సు 91 సంవత్సరాలు. ముంబైలోని ఓశివర శ్మశానంలో ఆయన దహన సంస్కారాలు నిర్వహించనున్నారు. బాలీవుడ్ ప్రముఖులందరూ మధురి దీక్షిత్ కి వారి సంతాపాన్ని తెలియజేశారు. వృద్యాప్యంలో వున్న ఆయన ఆరోగ్య పరిస్థితి గత కొద్ది రోజులుగా బాగోలేదు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ మధురి దీక్షిత్ కుటుంబానికి 123తెలుగు.కామ్ తరుపున సంతాపాన్ని తెలియజేస్తున్నాం.