మధుర శ్రీధర్ ద్విభాషా చిత్రం – ‘123’

మధుర శ్రీధర్ ద్విభాషా చిత్రం – ‘123’

Published on Sep 7, 2012 1:29 PM IST


‘స్నేహ గీతం’ మరియు ‘ఇట్స్ మై లవ్ స్టొరీ’ చిత్రాల దర్శకుడు మధుర శ్రీధర్ మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ చిత్రానికి ‘123’ అనే టైటిల్ ని ఖరారు చేసారు, ‘1 లైఫ్ 2 లవ్స్ 3 హార్ట్స్’ అనేది ఉపశీర్షిక. ఈ కొత్త చిత్రం ఈ నెల 20న హైదరాబాద్లో లాంచనంగా ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో ‘గ్యాంబ్లర్’ చిత్రంలో నటించిన తమిళ నటుడు మహాత్ హీరోగా నటించనున్నాడు. తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుండి ప్ర్రారంభం కానుంది. ఇది హిందీ సూపర్ హిట్ మూవీ ‘విక్కీ డోనర్’ సినిమాకి రిమేక్ అని వస్తున్న వార్తల పై మధుర శ్రీధర్ స్పందిస్తూ ‘ఈ సినిమా ‘విక్కీ డోనర్’ సినిమాకి రిమేక్ కాదని, విక్కీ డోనర్ చిత్ర రిమేక్ పనులు డిసెంబర్ నుంచి ప్రారంభిస్తానని’ ఆయన అన్నారు. ఈ చిత్ర హీరోయిన్ మరియు సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే అధికారికంగా తెలియజేస్తారు.

తాజా వార్తలు