“ఠాగూర్” చిత్ర రీమేక్ కు దర్శకత్వం వహించబోతున్న మధుర్ భండార్కర్

“ఠాగూర్” చిత్ర రీమేక్ కు దర్శకత్వం వహించబోతున్న మధుర్ భండార్కర్

Published on Mar 17, 2012 2:18 PM IST


మెగాస్టార్ చిరంజీవి నటించిన పవర్ ఫుల్ చిత్రం “ఠాగూర్” రీమేక్ కాబోతుంది. అన్ని సరిగ్గా జరిగితే ఈ చిత్రానికి మధుర్ భండార్కర్ దర్శకత్వం వహిస్తారు. మధుర్ భండార్కర్ గతం లో “చాందిని బార్” , “పేజ్ – 3” మరియు “ఫ్యాషన్” వంటి చిత్రాలతో తనదయిన శైలిని ఏర్పరుచుకున్నారు. తెలుగులో “ఠాగూర్ ” చిత్రానికి వి వి వినాయక్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తమిళ చిత్రం “రమణ” రీమేక్. విజయ్ కాంత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి మురుగదాస్ దర్శకత్వం వహించారు కథ బాగా నచ్చి సంజయ్ లీలా భన్సాలి ఈ చిత్ర రీమేక్ హక్కులను కొనుక్కున్నారు గత కొన్ని రోజులుగా ఈ చిత్రానికి మంచి దర్శకుని కోసం వెతికారు. ఒకానొక ముంబై పత్రిక అందించిన సమాచారం ప్రకారం సంజయ్ లీలా భన్సాలి ఈ మధ్యనే మధుర్ భండార్కర్ ని కలిసినట్టు సమాచారం ఒకవేళ అన్ని అనుకున్నట్టు జరిగితే మధుర్ భండార్కర్ “హీరొయిన్” చిత్రం పూర్తయిపోగానే ఈ చిత్రాన్ని మొదలు పెడతారు. ఆసక్తి కరమయిన విషయం ఏంటంటే సంజయ్ లీలా భన్సాలి తక్కువ కాలం లో చేస్తున్న రెండవ రీమేక్ ఈ చిత్రం ఇప్పటికే అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా లు ప్రధాన పాత్రలలో వస్తున్న “రౌడి రాథోర్” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు విక్రమార్కుడు చిత్రానికి రీమేక్.

తాజా వార్తలు