నెలాఖరున రానున్న “మేడిన్ వైజాగ్”

made-in-vizag
“ఇట్స్ మై లవ్ స్టొరీ” చిత్రంతో తెరకు పరిచయం అయిన నిఖిత నారాయణన్ కథానాయికగా మరాఠీలో ఘనవిజయం సాధించిన ‘ముంబయ్-పుణె-ముంబయ్’ చిత్రానికి రీమేక్ “మేడిన్ వైజాగ్” అనే చిత్రం వస్తుంది. ఈ చిత్రంలో యశ్విన్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి కన్మణి దర్శకత్వం వహిస్తుండగా తెలుగు మరియు తమిళంలో ఉదయశంకర్ ఆకెళ్ళ నిర్మిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెన్సార్ నుండి “యు” సర్టిఫికేట్ అందుకుంది. ఈ చిత్రంలో “ఇదే ఇదే భాగ్యనగరం” పాట చిత్రంలో ప్రధాన ఆకర్షణ కానుందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి విశ్వజిత్ జోషి సంగీతం అందించగా నాగమల్లి సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రాన్ని ఈ నెలాఖరున విడుదల చెయ్యనున్నారు.

Exit mobile version