వెంకటేష్ మూవీస్ నిర్మాణంలోని ప్రొడక్షన్ నం.2 చిత్రం “మావా” పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ప్రేమ్, వాసంతిక హీరో–హీరోయిన్లుగా నటిస్తుండగా, దళపతి, రాహుల్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రంతో ఏ.ఆర్. ప్రభావ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిర్మాత వెంకటేష్ బాలసాని క్లాప్ ఇవ్వగా, ఆయన సతీమణి పద్మ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సత్య సిరికి గౌరవ దర్శకత్వం వహించారు.
“మావా” కథ ముగ్గురు స్నేహితుల మధ్య సాగే ఒక భావోద్వేగ ప్రయాణం. స్నేహం మీద ఎన్నో సినిమాలు వచ్చినా, ఇందులో దర్శకుడు సరికొత్త కోణాన్ని చూపించబోతున్నారు.
అక్టోబర్ 3 నుండి హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. సంగీతం కళ్యాణ్ నాయక్, సినిమాటోగ్రఫీ ఈశ్వర్ రావ్, ఎడిటింగ్ కోటి భాధ్యతలు చేపడుతున్నారు.
