డబ్బింగ్ టీవీ సీరియల్స్ ని ప్రదర్శించడానికి విరుద్దంగా గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న నిరసనలు ఈ రోజు తారా స్థాయికి చేరాయి. దీనిలో బాగంగా ఈ రోజు మాటీవీ ఆఫీసుపై కొంతమంది టీవీ సీరియల్స్ యాక్టర్స్ దాడి చేశారు. రెండు కారులలో నుండి దిగిన కొంతమంది మాటీవీ ప్రసారం చేస్తున్న డబ్బింగ్ సీరియల్స్ పై నిరసనలు, నినాదాలు చేశారు. అనుకోకుండా వారు అక్కడ నిలిచివున్న కార్లపై రాళ్ళను విసరడంతో గొడవ ప్రారంభమైంది. దీనిలో మాటీవీ ఆఫీసు ఫర్నిచార్ చాలా వరకు పాడైంది.
అక్కడి సెక్యూరిటీ గార్డ్స్ దురుసుగా మాట్లాడటం వల్ల ఈ గొడవ జరిగిందని సమాచారం.
లోకల్ టీవీ యాక్టర్స్ గత కొద్ది రోజుల నుండి ఇప్పటివరకు డబ్బింగ్ సీరియల్స్ ని నిషేదించాలని చేస్తున్న నిరసనలో ఇలాంటి సంఘటన జరగడం నిజంగా బాధాకరం మాటీవీ ఆఫీసు పై జరిగిన ఈ దాడిని అందరు తీవ్రంగా ఖండిస్తున్నారు.