మా మ్యూజిక్ అవార్డ్స్ లో ఎస్. జానకి గారికి లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు

మా మ్యూజిక్ అవార్డ్స్ లో ఎస్. జానకి గారికి లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు

Published on Jan 20, 2013 4:36 PM IST

Maa-Music-Awards
శనివారం సాయం సంధ్యా సమయంలో టాలీవుడ్ పెద్దలు, హీరోలు, అందాల భామల నడుమ ఎంతో వైభవంగా మా మ్యూజిక్ అవార్డ్స్ వేడుక హైదరాబాద్లో జరిగింది. ఎంతో సందడిగా జరిగిన ఈ వేడుకలో భారతదేశపు లెజెండ్రీ సింగర్ ఎస్. జానకి గారికి లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డును అందించారు. ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ చేతుల మీదుగా ఎస్. జానకి గారికి అవార్డును అందజేశారు. ఈ వేడుకకి హాజరైన అల్లు అరవింద్, జయసుధ, నాగార్జున ‘సౌత్ ఇండియన్ నైటింగేల్’ అఫ్ ఇండియా అయిన జానకి గారిని తమ పొగడ్తలతో ముంచెత్తారు. అలాగే దేవీ శ్రీ ప్రసాద్, బాబా సెహగల్ తమ ఆటాపాటతో ప్రేక్షకులను అలరించారు.

తాజా వార్తలు