వాషింగ్టన్ వాసుల మెప్పు పొందిన కీరవాణి

వాషింగ్టన్ వాసుల మెప్పు పొందిన కీరవాణి

Published on Jun 30, 2013 3:30 PM IST

Keeravani
టాలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ప్రస్తుతం అమెరికాలో ప్రయాణిస్తున్నారు, మరి కొద్ది రోజులు అదే సిటీలో ఆయన పయనించనున్నారు. నిన్న ఆయన వాషింగ్టన్ డిసిలో చేసిన పెర్ఫార్మన్స్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కీరవాణి నాలుగు సంవత్సరాల తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్ కోసం ఈ ప్రోగ్రాం చేసారు. వాషింగ్టన్ డిసి తర్వాత కీరవాణి తన టీంతో కలిసి అట్లాంట వెళ్తున్నారు. ఈ టూర్ కి కీరవాణి తన ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళారు ఈ ట్రిప్ వాళ్ళకి ఒక వెకేషన్. ఇవన్నీ పక్కన పెడితే ఈ సంవత్సరం కీరవాణి గారు శేఖర్ కమ్ముల ‘అనామిక’, చంద్ర సిద్దార్థ్ ‘ ఏమో గుర్రం ఎగరావచ్చు’, ఎస్ఎస్ రాజమౌళి ‘బాహుబలి’ సినిమాలతో బిజీ బిజీగా ఉండనున్నారు.

తాజా వార్తలు