సెప్టెంబర్ 5న ‘లవ్ యూ రా’ విడుదల

సెప్టెంబర్ 5న ‘లవ్ యూ రా’ విడుదల

Published on Aug 19, 2025 6:25 AM IST

Love You Raa

సముద్రాల సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై చిన్ను, గీతికా రతన్ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన హారర్, లవ్, కామెడీ ఎంటర్‌టైనర్ ‘లవ్ యూ రా’ సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ప్రసాద్ ఏలూరి దర్శకత్వం వహించిన ఈ చిత్ర ఆడియో లాంచ్ ఈవెంట్ సోమవారం (ఆగస్ట్ 18) ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ‘ఏ మాయ చేశావే పిల్లా’, ‘వాట్సప్ బేబీ’, ‘యూత్ అబ్బా మేము’, ‘దైవాన్నే అడగాలా’ పాటలను విడుదల చేశారు.

చిత్ర బృందం మాటల్లో..

హీరో చిన్ను: “నా మొదటి సినిమా ‘లవ్ యూ రా’ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమా అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంది. హారర్, కామెడీ, లవ్.. అన్ని అంశాలుంటాయి. సెప్టెంబర్ 5న మా సినిమాను చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను.”

చంద్రశేఖర్: “ఈ సినిమా సెప్టెంబర్ 5న వస్తోంది. ఇది వందకు రెండొందల శాతం విజయం సాధిస్తుంది.”

హీరోయిన్ గీతిక: “టీం అంతా కలిసి సరదాగా షూటింగ్ చేశాం. సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. సెప్టెంబర్ 5న అందరూ చూసి సక్సెస్ చేయండి.”

నిర్మాత శ్రీనాథ్ ప్రజాపతి: “నేను సినిమా చూశాను, చాలా నచ్చింది. కొత్తవాళ్లు చేసినట్టు అనిపించదు. ఇది కచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుంది.”

దర్శకుడు ప్రసాద్ ఏలూరి: “నా టీంకు, డిస్ట్రిబ్యూటర్ దయానంద్‌గారికి ధన్యవాదాలు. సెప్టెంబర్ 5న మా సినిమా వస్తోంది. రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా నా స్ఫూర్తి. మీడియా మమ్మల్ని ప్రోత్సహించి, సినిమాను ప్రేక్షకులకు చేర్చాలని కోరుకుంటున్నాను.”

నటుడు కృష్ణ సాయి: “ఈ సినిమా అందరినీ నవ్విస్తుంది. దర్శకుడు చాలా కష్టపడ్డారు. హీరో, హీరోయిన్లు చక్కగా నటించారు. సినిమాను సక్సెస్ చేయాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాను.”

దర్శక, నిర్మాత నాగేష్: “ప్రసాద్ ఈ సినిమాను అద్భుతంగా తీశారు. సినిమాలో దమ్ముంటే చిన్నదా, పెద్దదా అని ప్రేక్షకులు పట్టించుకోరు. ‘లవ్ యూ రా’ టైటిల్ చాలా క్యాచీగా ఉంది. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.”

తాజా వార్తలు