విడుదల తేదీ : నవంబర్ 14, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : అనీష్, జాన్విక, ఆరోహి నారాయణ్, రాజీవ్ కనకాల, ప్రమోదిని తదితరులు
దర్శకుడు : :అనీష్
నిర్మాత : విజయ్ ఎం.రెడ్డి
సంగీత దర్శకుడు : ఆనంద్ రాజావిక్రమ్
సినిమాటోగ్రాఫర్ : హర్షవర్ధన్
ఎడిటర్ : శరత్ కుమార్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
కథ :
అక్షయ్ (అనీష్), సనా (ఆరోహి నారాయణ్) ఇద్దరూ కాలేజీలో ఉండగానే ప్రేమలో పడతారు. సనా అక్షయ్ ను వన్ సైడ్ లవ్ చేస్తూ ఉంటుంది. అక్షయ్ తండ్రి (రాజీవ్ కనకాల) ఒక పోలీస్ ఆఫీసర్. ఆయనకు ప్రేమ గీమా అంటే అసలు పడదు. ఇలాంటి నేపథ్యంలో అనీష్ సనాతో ఎలా ప్రేమలో పడ్డాడు. మంచి క్రికెటర్ అవ్వాలనే అతని గోల్ ఏమైంది ?, ఈ మధ్యలో అక్షయ్ ను.. సనా లవ్ పేరుతో చీటికి మాటికీ ఎలా వేధిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో అతనికి ఫిజియోథెరిస్ట్ నక్షత్ర (జాన్విక) పరిచయం అవుతుంది. ఆ తర్వాత అక్షయ్ ఆమెను ప్రేమించడం మొదలుపెడతాడు. మొత్తానికి ఈ ముగ్గురి కథ ఎలాంటి మలుపులు తిరిగింది?, చివరకు అక్షయ్ ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేసాడు ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్:
ఈ లవ్ ఓటీపీలో కొన్ని లవ్ అండ్ ఫన్ మూమెంట్స్ ఉన్నాయి. ఇష్టం లేని అమ్మాయిని ప్రేమించడం, లవ్‌లో ఆమెతో పడే కష్టాలు, నిజంగా ప్రేమించిన అమ్మాయిని పొందడానికి హీరో చేసే ప్రయత్నాలు.. ఇలా సాగిన ఈ కథ కొంతవరకు యూత్ ను బాగానే ఆకట్టుకుంది. ప్రధానంగా ఇద్దరి లవర్స్ మధ్య నలిగిపోయే హీరో సీన్స్ బాగున్నాయి. టాక్సిక్ రిలేషన్‌షిప్, ఒకరి అభిప్రాయాలను మరొకరిపై రుద్దడం వంటి లవ్‌లో జరిగే విషయాలను ఈ సినిమాలో బాగా చూపించారు.
ఈ సినిమాలో హీరోగా నటించిన అనీష్ ఈజ్ తో సెటిల్డ్ గా నటించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో అలాగే కొన్ని ప్రేమ సన్నివేశాల్లో అనీష్ నటన బాగుంది. హీరోయిన్ గా నటించిన ఆరోహి నారాయణ్ నటన సినిమాకి ప్లస్ అయింది. ప్రధానంగా సెకండ్ హాఫ్ లో ఆమె నటించిన విధానం సినిమాకి ప్లస్ అయ్యింది. మరో హీరోయిన్ జాన్విక కూడా చాలా బాగా నటించింది.
రాజీవ్ కనకాల పోలీస్ పాత్రలో మెప్పించారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. దర్శకుడు అనీష్ రాసుకున్న మెయిన్ థీమ్ బాగుంది. సెకండ్ హాఫ్ లో భావోద్వేగాలను కూడా దర్శకుడు ఎమోషనల్ గా బాగానే తెరకెక్కించాడు.
మైనస్ పాయింట్స్ :
ఈ లవ్ ఓటీపీ సినిమాలో యూత్ ఫుల్ ఎలిమెంట్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచినా, కథ కథానాలు మాత్రం రెగ్యులర్ గానే సాగాయి. నిజానికి సినిమా మెయిన్ పాయింట్ లో మ్యాటర్ ఉన్నపటికీ.. ఆ పాయింట్ కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. అసలు ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం బలమైన పాత్రలతో స్క్రీన్ ప్లేను నడపాలి. కానీ అలా జరగలేదు. హీరోహీరోయిన్ల మధ్య ప్రేమకు సంబంధించిన ట్రాక్ ను ఇంకా బలంగా బిల్డ్ చేసి ఉండాల్సింది.
ఫస్ట్ హాఫ్ లో కొన్ని ఫన్ సీన్స్ వర్కౌట్ అయినా.. మిగిలిన సీన్స్ రెగ్యులర్ గా సాగాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ప్లే ఇంట్రెస్ట్ లేకుండా సాగింది. పాత్రల మధ్య ఇంకా బలమైన కాన్ ఫ్లిట్ ను, సన్నివేశాలను రాసుకొని ఉండి ఉంటే బాగుండేది. ఐతే, సినిమా మీద ప్రేక్షకుడికి ఇంట్రెస్ట్ పుట్టించడానికి, దర్శకుడు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ ను ఎలివేట్ చేసే ప్రయత్నం అయితే చేశాడు.
సాంకేతిక విభాగం :
ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు అనీష్ దర్శకుడిగా కొన్ని చోట్ల పర్వాలేదనిపించినా.. రచయితగా విఫలం అయ్యాడు. ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్ గా సాగలేదు. కాకపోతే, తీసుకున్న మెయిన్ పాయింట్ బాగుంది. సంగీత దర్శకుడు అందించిన సంగీతం పర్వాలేదు. ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాలో చాలా వరకు బోర్ తగ్గేది. సినిమాలో సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. కొన్ని విజువల్స్ ను చాలా సహజంగా అలాగే చాలా అందంగా చూపించారు. ఫైనల్ గా నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
‘లవ్ ఓటీపీ’ అంటూ వచ్చిన ఈ యూత్ ఫుల్ ఎమోషనల్ లవ్ డ్రామాలో.. కొన్ని ఫన్ సీన్స్ అండ్ ఎమోషనల్ గా సాగే క్లైమాక్స్, హీరో – హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని లవ్ సీన్స్,
హీరో ఒకేసారి ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్‌ను మెయింటైన్ చేసే సీన్స్ బాగానే ఉన్నాయి. కానీ, కథాకథనాలు పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా లేకపోవడం, మెయిన్ క్యారెక్టరైజేషన్స్ బలహీనంగా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా, లవర్స్ కు ఈ సినిమాలో కొన్ని ఫన్ అండ్ లవ్ ఎలిమెంట్స్ బాగానే కనెక్ట్ అవుతాయి..
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team
