టాలీవుడ్ సినిమా లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘SSMB29’ చిత్ర టైటిల్, గ్లింప్స్ రివీల్ ఈ ఈవెంట్‌లో జరుగుతున్నాయి. అయితే, ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ పెడతారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా, ఈవెంట్‌లో ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్స్‌లో ఈ చిత్ర గ్లింప్స్‌ను ప్లే చేశారు. అక్కడున్న అభిమానులు ఈ గ్లింప్స్‌ను మొబైల్ ఫోన్స్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోల్లో SSMB29 చిత్ర టైటిల్ ‘వారణాసి’గా జక్కన్న ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇక మహేష్ బాబు లుక్ కూడా ఇందులో రివీల్ కావడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
అయితే, అధికారికంగా ఈ గ్లింప్స్ ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కెఎల్ నారాయణ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ చిత్రానికి నిజంగానే వారణాసి అనే టైటిల్ ఫిక్స్ చేశారా అనేది మరికొద్ది నిమిషాల్లో తేలనుంది.
