ఫిబ్రవరి మూడవ వారంలో రాబోతున్న లవ్ ఫెయిల్యూర్

ఫిబ్రవరి మూడవ వారంలో రాబోతున్న లవ్ ఫెయిల్యూర్

Published on Feb 5, 2012 8:23 PM IST

సిద్ధార్థ్, అమలా పాల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ ఫెయిల్యూర్’. ఎటాకి ఎంటర్టైన్మెంట్, శ్రీ సౌదామిని క్రియేషన్స్, వై నాట్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. ఈ చిత్రంతో బాలాజీ మోహన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తమన్ సంగీతం అందించిన ఇటీవలే ఈ చిత్ర ఆడియో విడుదలైన విపరీతమైన స్పందన లభిస్తోందని చిత్ర నిర్మాతల్లో ఒకరైన కె.వేణుగోపాల్ తెలిపారు. కళాశాల నేపధ్యంలో సాగే ఈ ప్రేమకథా చిత్రం యువతకు, ప్రేమికులకే కాకుండా పెద్దలకు కూడా బాగా దగ్గరవుతుందని అన్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి మూడవ వారంలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు.

తాజా వార్తలు