మాస్ బంక్ మూవీస్ పతాకంపై కొండా వెంకట రాజేంద్ర హీరోగా నటించిన హర్రర్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘లోపలికి రా చెప్తా’ చిత్రం ట్రైలర్ హైదరాబాద్‌లో ఘనంగా విడుదలైంది. ఈ చిత్రం జూలై 5, 2025న విడుదలకానుంది. ఇందులో కొండా వెంకట రాజేంద్ర, మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే కూడా కొండా వెంకట రాజేంద్రనే అందించారు. లక్ష్మీ గణేష్, వెంకట రాజేంద్ర నిర్మించిన ఈ సినిమా హర్రర్, కామెడీ, రొమాంటిక్ ఎలిమెంట్స్ కలిపి ప్రేక్షకులకు పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ అందించనుంది.
ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేయబడింది. ఆయన మాట్లాడుతూ, “ట్రైలర్ చాలా భయపెట్టేలా ఉంది. సినిమా మంచి కలెక్షన్స్ సాధించాలని ఆశిస్తున్నాను” అని అభిప్రాయపడ్డారు. అలాగే, దర్శకుడు కొండా విజయ్‌కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చిత్ర టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
హీరో, దర్శకుడు కొండా వెంకట రాజేంద్ర మాట్లాడుతూ, “నాలుగైదు జానర్లను కలిపి, రెండేళ్ల కష్టపడి ఈ చిత్రాన్ని రూపొందించాను. హర్రర్, కామెడీ, రొమాంటిక్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులకు పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ అందించే సినిమా ఇది” అని తెలిపారు.