గ్లామర్ ఒక్కటే మాలో ఉండే టాలెంట్ ని చూపించదు


ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ అంటే ఎక్కువ మంది వారు సినిమాలో గ్లామర్ కి మాత్రమే అని అంటారు. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మన హీరోయిన్లందరూ తన గ్లామర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ ట్రెండ్ చాలా సులభం మరియు దీనిని బేస్ చేసుకొనే ఇండస్ట్రీలో ఉన్న కొత్త హీరోయిన్లు తమ గ్లామర్ గురించి తప్పితే ఇంకా దేని గురించి పట్టించు కోవడం లేదు.

కానీ ఇప్పుడే తెలుగు ఇండస్ట్రీలో తొలి అడుగులేస్తున్న మళయాళ కుట్టి మాత్రం దీనికి పూర్తి విరుద్దం అంట. అమలా పాల్ మాట్లాడుతూ ‘ నేను గ్లామర్ కంటే నాలో ఉన్న టాలెంట్ మరియు మనం తెరపై ఎలా కనపడుతున్నాం అనే దాన్నే ఎక్కువ నమ్ముతాను. నేను చేసిన ‘లవ్ ఫెయిల్యూర్’ సినిమాలో ఎలాంటి మేకప్ వాడకుండా చాలా సహజంగా కనిపిస్తాను. మేకప్ అనేది మీ లుక్ ని కొంచెం మార్చవచ్చు కానీ అది మనం తెరపై మన పాత్రని మాత్రం చూపించదు. అందుకే నేను గ్లామర్ కంటే నటనకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తానని’ అన్నారు.

ప్రస్తుతం అమలా పాల్ తెలుగులో రామ్ చరణ్ సరసన ‘నాయక్’, అల్లు అర్జున్ సరసన ‘ఇద్దరమ్మాయిలతో’ మరియు నాని సరసన ‘జెండా పై కపిరాజు’ సినిమాల్లో నటిస్తింది.

Exit mobile version