నతాలియని నా కళ్ళతో చూడండి : రామ్ గోపాల్ వర్మ

నతాలియని నా కళ్ళతో చూడండి : రామ్ గోపాల్ వర్మ

Published on May 17, 2012 5:55 PM IST


విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘డిపార్ట్ మెంట్’ సినిమాతో రేపు మన ముందుకు రాబోతున్న సందర్భంగా హైదరాబాదులో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశానికి రామ్ గోపాల్ వర్మ, రానా, నతాలియ కౌర్, మధు శాలిని విచ్చేసారు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ డిపార్ట్మెంట్ తనకు స్పెషల్ మూవీ అని, తను మొదటి సినిమా అభిషేక్ బచ్చన్ తో చేయడం, రెండవ అమితాబ్ బచ్చన్ తో చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు అన్నారు. ఈ సినిమాలో శివ నారాయణ్ అనే పోలిస్ పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. నతాలియలో స్పెషల్ ఏంటి అడగగా? ఆమెని తన కళ్ళతో చూడమంటూ వర్మ చమత్కరించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రేపు విడుదలవుతుండగా హైదరాబాదులో ఈ రోజు ప్రీమియర్ షోలు వేయబోతున్నారు. ఈ సినిమాని తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు