లోకేష్ కనగరాజ్ తో అమీర్ ఖాన్ ఊహించని ప్రాజెక్ట్.. క్రేజీ జానర్లో

లోకేష్ కనగరాజ్ తో అమీర్ ఖాన్ ఊహించని ప్రాజెక్ట్.. క్రేజీ జానర్లో

Published on Jun 5, 2025 7:00 PM IST

ఇండియన్ సినిమా దగ్గర ఇపుడు భాషతో సంబంధం లేకుండా పలు క్రేజీ కాంబినేషన్ లు పడుతున్న సంగతి తెలిసిందే. మరి ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ లో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ అలాగే కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ కూడా ఒకటి. మరి ఈ కలయికలో ఆల్రెడీ కూలీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఇందులో అమీర్ హీరో కాదు కానీ తనని హీరోగా పెట్టి లోకేష్ కానగరాజ్ ఒక ఊహించని భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్టుగా ఇప్పుడు వినిపిస్తుంది. అయితే వీరి కలయికలో ఒక సూపర్ హీరో జానర్ సినిమాని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం అమీర్, లోకేష్ లు ఇదే ప్రాజెక్ట్ పై పని చేస్తున్నారని వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో సినిమా పట్టాలెక్కనుంది అని అమీర్ ఖాన్ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పినట్టు తెలుస్తుంది. మరి లోకేష్ కనగరాజ్ పొటెన్షియల్ కి అమీర్ ఖాన్ లాంటి స్టార్ తో సరైన సినిమా పడితే భారీ వసూళ్లు గ్యారెంటీ అని చెప్పవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు