ఇళయ దళపతి విజయ్ కెరీర్లో సూపర్ హిట్ అయ్యిన చిత్రాలు ఈ మధ్య కాలంలోనే చాలా ఉన్నాయి. మరి ఈ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో తెరకెక్కించిన చిత్రాలు కూడా ఉన్నాయి. మరి వాటిలో ‘మాస్టర్’ మరియు ‘లియో’ రెండిటికీ సెపరేట్ క్రేజ్ ఉంది. అయితే ఒరిజినల్ గా లియో చిత్రానికి సాలిడ్ సీక్వెల్ ఉంది. కానీ విజయ్ ఇపుడు జన నాయగన్ తో సినిమాలు ఆపేస్తున్నా అని చెప్పాడు.
కానీ సీక్వెల్ సినిమాలు కొన్ని పెండింగ్ ఉన్నాయి. అందరూ లియో 2 కోసం చూస్తుండొచ్చు కానీ లియో 2 కాకుండా లోకేష్ కనగరాజ్ పర్సనల్ గా మాస్టర్ 2 చేసేందుకు ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు తను లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలిపాడు. లియో కంటే తనకి జేడీ వైబ్ ఇష్టం అని అంతే కాకుండా ఆ పాత్ర విజయ్ కి దగ్గరగా ఉండేలా జాయ్ ఫుల్ గా ఉంటుంది అన్నట్టు లోకేష్ తెలిపాడు. అలాగే మాస్టర్ పార్ట్ 2 కి తగ్గట్టుగా ఇంకా తన దగ్గర కథ ఉందని కూడా రివీల్ చేయడం విశేషం. దీనితో లోకేష్ కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి.