ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న అవైటెడ్ చిత్రం “కూలీ” కోసం అందరికీ తెలిసిందే. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రజినీకాంత్ తో పాటుగా పాన్ ఇండియా లెవెల్లో బిగ్గెస్ట్ స్టార్స్ కూడా ఉన్నారు. తెలుగు నుంచి కింగ్ నాగార్జున, కన్నడ నుంచి ఉపేంద్ర, ఇలా అన్ని భాషలు నుంచి ప్రముఖ నటులు కూలీ సినిమాలో కనిపించగా అసలు వీరిపై లోకేష్ ఒక ఇంట్రెస్టింగ్ క్లారిటీ ఇచ్చాడు.
ఈ చిత్రంలో వీరు కేవలం క్యామియో పాత్రధారులు కాదని కన్ఫర్మ్ చేసాడు లోకేష్. వారి ఉదాహరణకు విక్రమ్ సినిమాలోనే తీసుకుంటే సూర్య నుంచి ఫహద్ ఫాజిల్ వరకు ఎలా అయితే అంతా కథకు కనెక్ట్ అయ్యి ఉంటారో అదే విధంగా కూలీలో కూడా అన్ని పాత్రలు కనెక్ట్ అయ్యి ఉంటాయని వారిని ఎందుకు తీసుకున్నామో రేపు థియేటర్స్ లో ఆడియెన్స్ చూసినప్పుడు వారికే అర్ధం అవుతుంది అని లోకేష్ ఒక చక్కని క్లారిటీ ఇవ్వడం జరిగింది.