ఓటీటీలో ‘కాంతార’కు చుక్కలు చూపెడుతున్న లేడీ సూపర్ హీరో..!

బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన రెండు సినిమాలు ఇప్పుడు ఓటీటీలో పోటీ పడుతున్నాయి. మలయాళంలో తెరకెక్కిన లేడీ సూపర్ హీరో మూవీ ‘లోక చాప్టర్ 1’ ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్‌లో నటించింది. ఇక ఈ సినిమాకు ఓటీటీలోనూ సాలిడ్ రెస్పా్న్స్ దక్కుతోంది.

మరోవైపు కన్నడ హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి రూపొందించిన ‘కాంతార చాప్టర్ 1’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఈ రెండు సినిమాలు కూడా ఒకేరోజున ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. కాగా ఈ రెండు సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చిన ఫస్ట్ వీకెండ్‌లో ఏ సినిమాకు ఎక్కువ రెస్పాన్స్ దక్కిందనే విషయంపై ఆర్మాక్స్ రిపోర్ట్ వెలువరించింది. ఈ రిపోర్ట్ ప్రకారం లోక చిత్రానికి 3.8 మిలియన్ వ్యూస్ రాగా, కాంతార చాప్టర్ 1కి 3.5 మిలియన్ వ్యూస్ దక్కాయి.

అయితే, కాంతార చాప్టర్ 1 ఇంకా హిందీలో అందుబాటులోకి రావాల్సి ఉంది. కాగా, లోక ఇప్పటికే పలు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

Exit mobile version