లాక్ డౌన్ పై మండి పడుతున్న యంగ్ హీరో..!

లాక్ డౌన్ పై మండి పడుతున్న యంగ్ హీరో..!

Published on May 3, 2020 11:30 AM IST

యంగ్ హీరో నిఖిల్ లాక్ డౌన్ పొడిగింపు కారణంగా తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఈ లాక్ డౌన్ వలన ఆయన పెళ్లి మళ్ళీ వాయిదా పడిన నేపథ్యంలో ఆయన ఇలా స్పందించారు. నిఖిల్ సిద్దార్ద్ కొద్దిరోజుల క్రితం తన ప్రేయసి పల్లవి తో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. కేవలం కుటుంబ సభ్యులు ఈ వేడుకకు హాజరుకావడం జరిగింది. కాగా ఆయన గత నెల 16న డాక్టర్ పల్లవిని గ్రాండ్ గా వివాహం చేసుకోవాలని భావించారు. ఐతే అప్పటికే కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ మొదలుకావడంతో ఆయన అయిష్టంగానే వివాహాన్ని వాయిదా వేసుకున్నారు.

లాక్ డౌన్ మే 3వ తేదీతో ముగుస్తుందని భావించిన నిఖిల్ కొత్త పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేశుకున్నారట. ఐతే మళ్ళీ లాక్ డౌన్ మే 3 నుండి 17వరకు పొడిగించారు. దీనితో హీరో నిఖిల్ అసహనానికి గురవుతున్నారట. ఈ విషయాన్ని ఓ ఇంగ్లీష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం జరిగింది. గత ఏడాది అర్జున్ సురవరం మూవీతో హిట్ అందుకున్న నిఖిల్, ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు