‘లిటిల్ హార్ట్స్’ చిన్న చిత్రంగా మొదలైనప్పటికీ, ప్రేక్షకుల మనసులను గెలుచుకొని బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. కేవలం రూ. 2.5 కోట్ల తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో మౌలి తనుజ్, శివాని నగరమ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాతో సాయి మార్తాండ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు.
ఇప్పటికే రెండో వారం లోకి అడుగుపెట్టిన ఈ చిత్రం, విడుదలైన మొదటి వారం ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా రూ. 32.15 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. రిలీజ్‌కి కేవలం 10 రోజుల్లోనే ఇంతటి ఘనవిజయం సాధించడం నిజంగా విశేషం.
రాజీవ్ కనకాల, అనితా చౌదరి, జై కృష్ణ, నిఖిల్ అబ్బూరి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఆదిత్య హాసన్ నిర్మించిన ఈ సినిమాను బన్నీ వాస్, వంశీ నందిపాటి డిస్ట్రిబ్యూట్ చేశారు. సంగీతాన్ని సింజిత్ యెర్రమిల్లి సమకూర్చారు.