మన టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన అవైటెడ్ భారీ చిత్రమే “కింగ్డమ్”. విజయ్ నుంచి ఒక సాలిడ్ స్పై యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన సాంగ్ మంచి హిట్ అయ్యింది.
ఇక ఈ సినిమా విడుదల పవన్ వీరమల్లు ఎఫెక్ట్ తో అటు ఇటుగా ఉందని టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. కింగ్డమ్ అనుకున్నట్లుగా మే 30నే రాబోతుందట. హరిహర వీరమల్లు ప్రస్తుతానికి ఇంకా డేట్ లాక్ చేసుకోకుండా ఉండడంతో కింగ్డమ్ అనుకున్న సమయానికే వస్తుంది అని ఇపుడు టాక్.