లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఆడియో విడుదల

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఆడియో విడుదల

Published on Jul 28, 2012 4:00 AM IST


శేఖర్ కమ్ముల తన రాబోతున్న చిత్రం ” లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ” లో కొన్ని సర్ప్రైజస్ ఉంచబోతున్నారు. ఈ చిత్రంతో అభిజీత్, సుధాకర్, కౌశిక్, షాగున్, జార మరియు రేష్మ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణ, దాదాపుగా రెండు దశాబ్దాల తరువాత అమల తిరిగి చిత్రాలలో నటించడం. అమల, నాగార్జునతో పెళ్ళయ్యాక నటనా జీవితానికి దూరంగా ఉండిపోయారు. చాలా కాలం తర్వాత శేఖర్ కమ్ముల “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ” చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నారు. అమల కాకుండా ఈ చిత్రంలో శ్రియ సరన్ మరియు అంజలా జవేరిలు కూడా కనిపించనున్నారు. ఈరోజు ఇక్కడ హైదరాబాద్ లో ఈ చిత్ర ఆడియో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నాగార్జున, అమల అక్కినేని, శ్రియ సరన్, రానా, అఖిల్ అక్కినేని, అభిజీత్, సుధాకర్,కౌశిక్, షాగున్, జార, రశ్మి, దిల్ రాజు మరియ రమేష్ ప్రసాద్ పాల్గొన్నారు.

శేఖర్ కమ్ముల ప్రేక్షకులతో మాట్లాడుతూ ” ఈ చిత్రం కోసం మేము రెండేళ్ళ పాటు కష్టపడ్డాము. ఆరునెలల పాటు కష్టపడి స్టార్ హంట్ లో నటీనటులను ఎంపిక చేశాము. అమల గారిని ఈ చిత్రంలో పాత్ర కోసం కలిసినప్పుడు ఒప్పుకుంటారు అని నమ్మకం లేదు కాని ఒప్పుకున్నారు ఈ చిత్రంలో అమల గారి పాత్ర చాలా కీలక పాత్ర. శ్రియ మరియు అంజలా జవేరిలు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు .నేను రికార్డ్ బ్రేకింగ్ సినిమాలు తీయాలని అనుకోను జనం సినిమాలో తమని చూసుకునే విధమయిన సినిమాలే తీస్తాను” అని అన్నారు. ఈ చిత్రం ఒక కాలేనిలో నివసించే ఆరుగురు యువతీయువకుల కథ. మిక్కి జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించగా విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. రచన,నిర్మాణం మరియు దర్శకత్వ భాద్యతలను శేఖర్ కమ్ములనే చూసుకున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదల కానుంది

తాజా వార్తలు