శేకర్ కమ్ముల తెరకెక్కించిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో హీరోగా నటించిన సుధాకర్ కొమాకులకు తన సహజ నటనకుగానూ ప్రశంసలు అందుకున్నాడు. ఆ సినిమా తరువాత మరో చిత్రాన్ని అంగీకరించాదానికి చాలానే సమయం తీసుకున్నాడని చెప్పాలి ఎట్టకేలకు ‘అం ఆద్మీ పిక్చర్స్’ సంస్థలో రుపుదిద్దుకోబోతున్న ఒక సినిమాను అంగీకరించాడు. రవి బాబు స్కూల్ నుండి వచ్చిన అరుణ్ దాస్యం ఈ సినిమాతో దర్శకుడిగా మారనున్నాడు. ఈ సినిమా నిండా ప్రేమ, కుటుంబసంబంధాలు, స్పోర్ట్స్ మరియు మ్యూజిక్ ఉంటుందని దర్శకుడు తెలిపాడు. స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుందని, హీరో పాత్ర చిత్రీకరణ వైవిధ్యమని జతకలిపాడు ఈ సినిమా షూటింగ్ ఈ నెల 17నుండి మొదలయ్యి సింగల్ షెడ్యూల్ లో పుర్తిచేసుకోనుంది. రామ్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు.