నందమూరి బాలకృష్ణ ‘లెజెండ్’ ప్రస్తుతం నిర్మాణ దశలో వుంది. ప్రస్తుతం వైజాగ్ లో షూటింగ్ ప్రస్తుత షెడ్యూల్ డిసెంబర్ 15న ముగియనుంది. దీంతో చాలా శాతం షూటింగ్ పుర్తికానుంది.
బోయపాటి శ్రీను రెండోసారి బాలకృష్ణతో నటిస్తున్నాడు. గతంలో వీరి కలయికలో వచ్చిన సింహా పెద్ద హిట్ అయ్యింది. అలాగే ఈ సినిమాకూడా ఒక పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. బాలకృష్ణ ను కొత్త అవతారం లో చుడనున్నాము. ఈ సినిమాకు ఉపయోగించిన కొత్త బైక్ అందరి దృష్టిని దృష్టిని ఆకర్షించింది. దేవి శ్రీప్రసాద్ సంగీత దర్శకుడు. బాలకృష్ణ రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్. ఈ సినిమాను వారాహి చలనచిత్రం మరియు 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.