హైదరాబాద్లో ‘లెజెండ్’ ఫైటింగ్ సన్నివేశాల చిత్రీకరణ

హైదరాబాద్లో ‘లెజెండ్’ ఫైటింగ్ సన్నివేశాల చిత్రీకరణ

Published on Jan 16, 2014 12:08 AM IST

Legend_First_Look(1)
​నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘లెజెండ్’ సినిమా షూటింగ్ చురుగ్గా సాగుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరబాద్ లో జరుగుతోంది. కొన్ని ముఖ్యమైన సన్నివేశాల కోసం సింహాచలం ను పోలిన సెట్ ని వేయడం జరిగింది. బాలకృష్ణ, మరికొంతమందిపై ఫైట్ సన్నివేశాలను చిత్రికరిస్తున్నారని సమాచారం. ఇక్కడే మరికొన్ని రోజులు షూటింగ్ జరిగే అవకాశం వుంది. ఇప్పటికే కమల్ కామరాజు, ప్రభాకర్ ల టాకింగ్ పార్టును షూట్ చేయడం జరిగింది. జగపతి బాబు విలన్ నటిస్తున్న ఈ సినిమాలో రాధిక ఆప్టే, సోనాల్ చౌహన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా త్వరలో విడుదలయ్యె అవకాశం ఉంది.

తాజా వార్తలు