సెన్సార్ క్లియరెన్స్ కోసం ‘లెజెండ్’ నిరీక్షణ

Legend
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘లెజెండ్’ సినిమా మరో రెండు రోజుల్లో అనగా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ ఇప్పటి వరకూ ఈ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాలేదు. అనుకున్న దాని ప్రకారం సోమవారం సెన్సార్ జరగాలి కానే అనివార్య కారణాల వల్ల అది మంగళవారంకి వాయిదా పడింది. నిన్న సెన్సార్ వారు సినిమా చూసినప్పటికీ క్లియరెన్స్ మాత్రం ఇవ్వలేదు.

మాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ఏమిటంటే లెజెండ్ సినిమాలో రాజకీయలకు సంబంధించి కొన్ని భారీ డైలాగ్స్ ఉండడం వల్ల సెన్సార్ వారు ఎలక్షన్ కమీషన్ తో చర్చించి క్లియరెన్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. కావున ఈ రోజు సాయంత్రం లోగా సెన్సార్ వారి నుండి క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉంది.

బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ఈ సినిమాని వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించారు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటించగా దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు.

Exit mobile version