లాక్ చేసిన ‘లెజెండ్’ రన్ టైం

లాక్ చేసిన ‘లెజెండ్’ రన్ టైం

Published on Mar 26, 2014 9:40 PM IST

2nd-look-poster-LEGEND-pla

గత మూడు రోజులుగా సెన్సార్ జరుగుతుందా లేదా అని టెన్షన్ పడిన ‘లెజెండ్’ టీంకి ఈ రోజు సాయంత్రానికి కాస్త ఊరట లభించింది. ఎట్టకేలకు సెన్సార్ వారు కొన్ని మైనర్ కట్స్ తో ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రన్ టైం 2 గంటల 27 నిమిషాలు. ప్రకటనలతో కలుపుకొని 2 గంటల 28 నిమిషాలు ఉంటుందని అంటున్నారు.

నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రేజ్ వల్ల ఈ రోజు ఆన్ లైన్ లో టికెట్స్ ఓపెన్ చెయ్యగానే వేగంగా అమ్ముడు పోయాయి. ఒక్క ఐ మాక్స్ లోనే కేవలం ఒక గంటలో 2500 టికెట్స్ అమ్ముడు పోయాయి అంటే ఈ సినిమా కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ఈ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లో రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటించారు. వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన ఈ మాస్ ఎంటర్టైనర్ కి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఈ నెల 28న అత్యంత భారీ ఎత్తున ఈ సినిమా రిలీజ్ కావడానికి రెడీ అవుతోంది.

తాజా వార్తలు