దీపావళికి లెజెండ్ ఫస్ట్ లుక్?

దీపావళికి లెజెండ్ ఫస్ట్ లుక్?

Published on Oct 25, 2013 3:50 AM IST

balakrishna
ఫిలింనగర్ నుండి లభించిన సమాచారం ప్రకారం నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘లెజెండ్’ సినిమా మొదటి లుక్ దీపావళికి విడుదలకానుంది. మాకందిన నమ్మదగిన వర్గాల సమాచారం ప్రకారం బాలయ్య బాబు రెండు విభిన్న గెట్ అప్ లలో కనిపించనున్నాడు. ఈ విషయం ఇంకా అధికారికంగా ప్రకటించాల్సివుంది

‘లెజెండ్’ సినిమాలో జగపతిబాబు ప్రతినాయక పాత్ర పోషిస్తున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వారాహి చలన చిత్ర మరియు 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు

దేవి శ్రీ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్ కోసం కొన్ని మంచి ట్యూన్లతో అందమైన సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. రాధికా ఆప్టే మరియు సోనాల్ చౌహాన్ ఈ సినిమాలో హీరోయిన్స్

తాజా వార్తలు