‘లెజెండ్’ 2 టికెట్ల ధర 1116 డాలర్లు.!

‘లెజెండ్’ 2 టికెట్ల ధర 1116 డాలర్లు.!

Published on Mar 25, 2014 12:49 PM IST

legend

నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘లెజెండ్’ ఈ శుక్రవారం భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి ఒక్క తెలుగు నాటే కాకుండా ఓవర్సీస్ లో కూడా మంచి క్రేజ్ నెలకొంది. ఒవస్ర్సీ లోని బాలకృష్ణ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఆదివారం రోజున డెట్రాయిట్లో బాలకృష్ణ అభిమానులు లెజెండ్ విడుదల సందర్భంగా విడుదల మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురువారం వేయబోయే ప్రీమియర్ షో కి సంబందించిన మొదటి రెండు టికెట్లను వేలం పాటలో 1116 డాలర్లకి సొంతం చేసుకున్నారు. అప్పుడు లైవ్ కాన్ఫిరెన్స్ లో మాట్లాడిన బాలయ్య సినిమా చాలా బాగా వచ్చిందని, అందరికీ నచ్చుతుందని చెప్పడమే కాకుండా అక్కడి అభిమానులకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.

బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా సింహా ని మించి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన ఈ సినిమాకి ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలను జరుపుకోనుంది.

తాజా వార్తలు