బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ఎపిక్ మైథలాజికల్ చిత్రం రామాయణ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నితేష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం గురించి నార్త్‌తో పాటు సౌత్‌లోనూ సాలిడ్ హైప్ క్రియేట్ అయింది.
అయితే, ఈ సినిమా బడ్జెట్ ఏకంగా రూ.1600 కోట్లు ఉంటుందనే టాక్ ఇటీవల వినిపిస్తుండటంతో ఈ సినిమాలో నటిస్తున్న వారి రెమ్యునరేషన్ ఏ రేంజ్‌లో ఉంటాయా అనే చర్చ కూడా సాగుతుంది. కాగా, ఈ సినిమాలో రాముడిగా నటిస్తున్న రణ్‌బీర్ కపూర్ ఈ సినిమా కోసం ఏకంగా రూ.150 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. అయితే, ఇది రెండు భాగాలకు కలిపి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక సాయి పల్లవి ఈ సినిమా కోసం రూ.15 కోట్లు తీసుకుంటుందట.
ఇలా లీడ్ రోల్స్‌లో నటిస్తున్న వీరిద్దరు ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోవడం బి టౌన్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఇక ఈ సినిమాలో రావణుడి పాత్రలో యష్, లక్ష్మణుడిగా రవి దూబె, హనుమాన్‌గా సన్నీ డియోల్ నటిస్తున్నారు. 2026 దీపావళికి మొదటి భాగం.. 2027 దీపావళికి రెండో భాగాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.