చిత్రీకరణ మొదలు పెట్టుకున్న ముని 3

చిత్రీకరణ మొదలు పెట్టుకున్న ముని 3

Published on Jan 21, 2013 11:05 PM IST

MUNI3
రాఘవ లారెన్స్ మరొక హారర్ కామెడీ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నధం అయ్యారు. ఈ చిత్రానికి “ముని 3” అనే పేరుని పరిశీలిస్తున్నారు. ఈ చిత్రంలో రాఘవ లారెన్స్ మరియు తాప్సీ కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రం నిన్న చెన్నైలో చిత్రీకరణ మొదలు పెట్టుకుంది ఈ చిత్రీకరణలో లారెన్స్ మరియు తాప్సీ ఇద్దరు పాల్గొన్నారు. ఈ విషయాన్నీ తాప్సీ స్వయంగా చెప్పారు. ఈ చిత్రంలో నటించడానికి తాప్సీ భారీగా పారితోషకం తీసుకున్నట్లు పుకార్లు కూడా ఉన్నాయి. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయ్ ఆంధోనీ సంగీతం అందిస్తున్నారు “కాంచన” చిత్ర విజయం తరువాత ఈ చిత్రంతో కూడా లారెన్స్ అదే మాయాజాలాన్ని పునరావృతం చేస్తారని బెల్లంకొండ సురేష్ ధీమాగా ఉన్నారు.

తాజా వార్తలు