అందాల రాక్షసి గా ప్రేక్షకుల మదిలో దూసుకెళ్లిన లావణ్య త్రిపాటి ఇప్పుడు ఒక ద్విభాషా చిత్రానికి సంతకం చేసింది. తెలుగు, తమిళ భాషలలొ తెరకెక్కనున్న ఈ సినిమాలో గౌతమ్ కార్తీక్ హీరో. గౌతమ్ మీనన్ నిర్మాత. విజ్ఞేష్ శ్రవణ్ దర్శకుడు
సమాచారం ప్రకారం ఈ సినిమాలో లావణ్య చెవిటి పాత్ర పోషించనుంది. ఒక పాత్రకకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో “నాది చెవిటి పాత్రే అయినా ఆ పాత్రకు చాలా వైవిధ్యం వుంది. నాకీ స్క్రిప్ట్ చాలా నచ్చింది” అని తెలిపింది. ఈ సినిమా హీరో గత యేడాది మణిరత్నం తీసిన కడలి సినిమాతో పరిచయం అయ్యాడు