అందర్లో ‘అందాల రాక్షసి’ లావణ్యానే టాప్

అందర్లో ‘అందాల రాక్షసి’ లావణ్యానే టాప్

Published on Jul 30, 2012 12:45 PM IST


ఈ మధ్య కాలంలో వచ్చిన ఏ కొత్త హీరొయిన్ ని మీరు బాగా ఇష్ట పడుతున్నారు? అనే ప్రశ్న పై ఆంధ్ర ప్రదేశ్ లోని పలు కాలేజీల్లో సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ఎక్కువ మెజారిటీ లావణ్య కే దక్కింది, లావణ్య మరెవరో కాదండి మన ‘అందాల రాక్షసి’.

‘అందాల రాక్షసి’ మూవీ విసువల్స్ విడుదలైనప్పటి నుంచి తన అందమైన లుక్స్ తో లావణ్య యువత యొక్క మదిని గెలుచుకున్నారు. డెహ్రాడున్ లో జన్మించిన ఈ భామ పూర్తి పేరు లావణ్య త్రిపతి. లావణ్య నాన్న గారు ఒక లాయర్ మరియు ఆమె తల్లి ఒక రిటైర్డ్ టీచర్. లావణ్య ఇప్పటివరకు చాలా ప్రకటనల్లో నటించారు, ‘అందాల రాక్షసి’ సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. లావణ్య గతంలో ‘మిస్ ఉత్తరాఖండ్ – 2006’ టైటిల్ ని కూడా గెలుకున్నారు.

‘అందాల రాక్షసి’ చిత్రంలో లావణ్య కాస్ట్యూమ్స్ మరియు లుక్ చూసి గతంలో అక్కినేని నాగార్జున సరసన ‘గీతాంజలి’ చిత్రంలో నటించిన గిరిజా షెత్తర్ ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. 1989లో గిరిజా షెత్తర్ కూడా ఇలాంటి గుర్తింపునే సంపాదించుకున్నారు. ఆగష్టు 10న ‘అందాల రాక్షసి’ విడుదలైన తర్వాత ఈ అందాల రాక్షసి అదే నండి లావణ్య ఎంత మంది హృదయాల్ని గెలుచుకుంటుందో చూద్దాం.

తాజా వార్తలు