విశాల్ ‘మకుటం’ క్లైమాక్స్ పై లేటెస్ట్ అప్డేట్!

విశాల్ ‘మకుటం’ క్లైమాక్స్ పై లేటెస్ట్ అప్డేట్!

Published on Nov 18, 2025 8:09 AM IST

కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ కి తెలుగులో కూడా ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. అయితే విశాల్ ప్రస్తుతం ఇతర దర్శకులు తోనే కాకుండా తన స్వీయ దర్శకత్వంలోనే ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఆ చిత్రమే “మకుటం”. తన దర్శకత్వంలోనే తెరకెక్కిస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఫైనల్ గా క్లైమాక్స్ షూట్ ని పూర్తి చేసేసుకున్నట్టుగా విశాల్ తెలిపాడు.

ఇక సెట్స్ నుంచి విశాల్ వర్క్ పై ఒక ఇంట్రెస్టింగ్ మేకింగ్ వీడియోని రిలీజ్ కూడా చేయడం జరిగింది. ఇందులో 17 రోజులు పాటుగా ఈ క్లైమాక్స్ షూట్ ని కేవలం రాత్రి షూటింగ్ మాత్రమే చేసినట్టు తెలిపారు. అలాగే ఇందులో టీం అంతా గట్టిగానే శ్రమించినట్టు కూడా కనిపిస్తుంది. మరి విశాల్ తన మొదటి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి విశాల్ నే నిర్మాణం వహిస్తుండగా మేకర్స్ ఈ సినిమాని వచ్చే ఏడాది రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు.

తాజా వార్తలు