మన టాలీవుడ్ నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మరియు మోస్ట్ ప్రిస్టేజియస్ ప్రాజెక్టులలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ డ్రామా “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. ఇప్పటికే భారీ నెలకొల్పుకున్న ఈ చిత్రం మొత్తం అన్ని కీలక భాషల్లోనూ విడుదల కానుంది.
బాక్సాఫీస్ ను రూల్ చేసే ఈ ఇద్దరి హీరోలను ఒకే సినిమాలో చూపించడం అనేది చిన్న విషయం ఏమీ కాదు. కానీ రామరాజుగా రామ్ చరణ్ ను కొమరం భీం గా ఎన్టీఆర్ ను రాజమౌళి అత్యద్భుతంగా బ్యాలన్స్ చేసి చూపించనున్నారని టాలీవుడ్ డైలాగ్ రైటర్ మాధవ్ బుర్రా ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ద్వారా తెలిపారు. అలాగే తాను కూడా ఆ రెండు బలమైన పాత్రలకు తగ్గట్టుగానే మాటలు అందించానని ఆయన తెలిపారు. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒకే స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు కనిపిస్తారా అని వారి ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు.