ప్రభాస్, హను ప్రాజెక్ట్ పై లేటెస్ట్ అప్డేట్!

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ఆల్రెడీ షూటింగ్ కొనసాగించుకుంటున్న చిత్రం దర్శకుడు హను రాఘవపూడితో కూడా ఉంది. మరి ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొనగా ఒక పక్క రాజా సాబ్ ఇంకోపక్క ఈ సినిమాని ప్రభాస్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. అయితే ఈ భారీ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది.

ప్రభాస్ ఈ మధ్యనే హైదరాబాద్ కి వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ రావడంతోనే రాజా సాబ్ కి డబ్బింగ్ చెప్పడమే కాకుండా హను ప్రాజెక్ట్ లో ఈ రెండు రోజుల్లోనే జాయిన్ కానున్నట్టుగా తెలుస్తుంది. మేకర్స్ దాదాపు నెలన్నర పాటుగా ఈ షెడ్యూల్ ని ప్లాన్ చేసుకున్నారట. సో ప్రభాస్ పై ఈ షెడ్యూల్ తో చాలా వరకు షూటింగ్ అవుతుంది అని తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version