జాన్వీ కపూర్ నే ఫిక్స్ చేయనున్నారట !

జాన్వీ కపూర్ నే ఫిక్స్ చేయనున్నారట !

Published on Jul 18, 2020 5:35 PM IST

ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అలవైకుంఠపురములో’ వంటి హిట్ చిత్రాల తరువాత, త్రివిక్రమ్ తన తర్వాతి చిత్రాన్ని కూడా మళ్లీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేయనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ లో కనిపించబోతున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే సినిమా మొత్తం తారక్ డబుల్ రోల్ లో కనిపిస్తాడా లేక ప్లాష్ బ్యాక్ లో సెకెండ్ రోల్ వస్తోందా అనేది తెలియాల్సి ఉంది. అయితే తారక్ రెండు పాత్రల్లో ఒక పాత్ర గురించి లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే, తారక్ ఒక పాత్రలో రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నాడట. పలనాడు ప్రాంతానికి సంబంధించిన రాజకీయ నాయకుడిగా తారక్ కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ను బాలీవుడ్ నుండి తీసుకోవాలనే ఆలోచనలో ఉంది చిత్రబృందం.

మెయిన్ గా జాన్వీ కపూర్ ను ఫిక్స్ చేయనున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తే.. జాన్వీకి మంచి లాంచింగ్ అవుతుంది. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ పెట్టాలనుకుంటున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక మరో కథానాయికగా పూజా హెగ్డేను తీసుకోవాలనే యోచనలో ఉన్నారు త్రివిక్రమ్.

తాజా వార్తలు